మెగాస్టార్ చేతుల మీదుగా విష్ణు సినిమా ఆడియో

మంచు విష్ణు హీరోగా నటించిన ‘దేనికైనా రెడీ’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 28న జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రానున్నారు. చక్రి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో వేడుకని ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ సినిమా కోసం వేసిన గంధర్వమహల్ సెట్లో నిర్వహించనున్నారు.

మెగాస్టార్ చిరంజీవికి మరియు కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబుకి ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి సంబందాలు ఉన్నాయి. వాళ్ళిద్దరిదీ టాం మరియు జెర్రీ లాంటి స్నేహబందం అని వాళ్ళే అంటూ ఉంటారు. ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న సత్సంబందం వల్ల విష్ణు సినిమా ఆడియో రిలీజ్ వేడుకకు చిరంజీవి రావడానికి అంగీకరించారు. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. హన్సిక కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని మంచు విష్ణు తన సొంత బ్యానర్లో నిర్మించారు.

Exit mobile version