1 మిలియన్ ఫ్యామిలీతో మెగాస్టార్.!

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ భారీ క్రేజ్ తో తన సినిమాలకు రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబడుతున్నారు. ఒక సినిమా అంటే భారీ స్థాయిలో బజ్ ను క్రియేట్ చేసుకోడం కూడా ఇప్పుడున్న స్టార్ హీరోల సినిమాల కంటే కూడా ఎక్కువగానే ఉంటుంది.

అయితే చిరు చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు. సినిమాలకు కానీ మధ్యలో ఎంతో అభివృద్ధి చెందిన సోషల్ మీడియాకు కాని దూరంగా ఉన్నారు. కానీ ఎట్టకేలకు సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చాక బాస్ సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారు. ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ లలో ఎంటర్ అయిన బాస్ మొదటి 24 గంటల్లోనే భారీ ఎత్తున ఫాలోవర్స్ ను రాబట్టుకున్నారు.

అంతే కాకుండా తన సోషల్ మీడియా మాధ్యమాలతో ఇస్తున్న ఎంటర్టైన్మెంట్ కూడా మామూలుగా ఉండడం లేదు. అలా ఇపుడు లేటెస్ట్ గా తన ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ ను 1 మిలియన్ మార్క్ కు పెంచుకున్నారు. అలాగే లేటెస్ట్ గా తన గుండు లుక్ పోస్ట్ ను కూడా ఒక్క ఇన్స్టా లోనే షేర్ చేసుకోడం విశేషం.

Exit mobile version