‘ఓజి’ పై మెగాస్టార్ ఏమన్నారంటే!

‘ఓజి’ పై మెగాస్టార్ ఏమన్నారంటే!

Published on Sep 25, 2025 2:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి సుజీత్ ఫుల్ మీల్స్ ఇచ్చేలా తెరకెక్కించారు. ఇక ఈ చిత్రంపై లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి స్పందించడం చిత్ర యూనిట్ కి అలాగే అభిమానులకి మంచి కిక్ ఇచ్చింది.

ఇక ఈ చిత్రంపై మెగాస్టార్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఓజాస్ గంభీరగా కళ్యాణ్ బాబుని అంతా సెలబ్రేట్ చేయడం ఎంతో ఆనందం కలిగిస్తుంది అని అలాగే దర్శకుడు సుజీత్ కి నిర్మాత దానయ్య ఇంకా థమన్ సాలిడ్ వర్క్ కి తాను కంగ్రాట్స్ తెలిపారు. అలాగే ఇతర నటీనటులకు మెగాస్టార్ తన అభినందనలు తెలిపారు. దీనితో చిత్ర నిర్మాణ సంస్థ సైడ్ నుంచి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు