ఓటిటి ఎంట్రీపై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఓటిటి ఎంట్రీపై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Jun 23, 2025 7:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు నటిస్తున్న భారీ చిత్రాల్లో దర్శకుడు వశిష్ఠతో చేస్తున్న అవైటెడ్ చిత్రం “విశ్వంభర” కోసం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ వెంటనే దర్శకుడు అనీల్ రావిపూడితో క్రేజీ ఎంటర్టైనర్ ని చేస్తున్నారు. అయితే మన సీనియర్ హీరోస్ లో ఒక్క చిరు తప్ప మిగతా స్టార్స్ వెంకీ మామ, నాగార్జున బాలయ్య కూడా తమ ఓటిటి డెబ్యూ ఇచ్చారు.

హోస్ట్ గానో, నటుడు గానో ఏదొకలా ఓటిటి ఆడియెన్స్ ని అలరించారు. అయితే మిగిలిన వన్ అండ్ ఓన్లీ హీరో మెగాస్టార్ ఎంట్రీ ఎప్పుడు అనేది కూడా ఆసక్తిగా మారింది. అయితే మెగాస్టార్ కి ఎపుడో ఓటిటిలో ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఆఫర్ వచ్చింది కానీ అప్పుడు తాను రిజెక్ట్ చేశారు.

అయితే లేటెస్ట్ గా కుబేర ఈవెంట్ లో తన ఓటిటి ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకి కూడా సరైన రోల్ పడితే ఓటిటిలో వెబ్ సినిమాలు లాంటివి చేసేందుకు సిద్ధమే అని క్లారిటీ ఇచ్చేసారు. సో మెగాస్టార్ నుంచి అవైటెడ్ ఓటీటీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు