మెగాస్టార్ సూపర్బ్ ప్రాజెక్ట్ కు ముహూర్తం ఫిక్సయ్యిందా?

మెగాస్టార్ సూపర్బ్ ప్రాజెక్ట్ కు ముహూర్తం ఫిక్సయ్యిందా?

Published on Oct 14, 2020 9:08 PM IST


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కెరటాల శివతో “ఆచార్య” అనే భారీ ప్రాజెక్ట్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ రెండు రీమేక్ చిత్రాలను లైన్ లో పెట్టారు. వాటిలో ఒకటి వివి వినాయక్ తో “లూసిఫర్” రీమేక్ కాగా మరొకటి మెహర్ రమేష్ తో “వేదాళం” రీమేక్ ఒకటి. అయితే వీటిలో వినాయక్ తో సినిమానే ముందు షూట్ ప్రోగ్రెస్ కు తీసుకెళ్లనున్నారని తెలిసిందే.

వచ్చే జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఈ ప్రాజెక్ట్ మొదలు కానుంది అని టాక్. అయితే ఇపుడు వినిపిస్తున్న మరో లేటెస్ట్ టాక్ ప్రకారం మెహర్ తో చేయనున్న వేదాళం రీమేక్ తాలూకా ముహూర్తం ఈ దసరాకే పెట్టనున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ఎప్పుడు మొదలు కానుందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చిరు నటిస్తున్న ఆచార్య షూట్ తిరిగి పునః ప్రారంభం కావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు