మరో సినిమాకి ఓకే చెప్పిన మెగాహీరో !

సుప్రీం హీరో సాయి తేజ్ ‘ప్రతిరోజూ పండగే’ సూపర్ హిట్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం వరుస సినిమాలను అంగీకరిస్తున్నాడు. ఒక సినిమా ఆల్ రెడీ షూట్ లో ఉంది, అలాగే కరోనా అనంతరం మరో సినిమా సెట్ మీదకు వెళ్లబోతుంది. ఇవి కాకుండా ఆల్ రెడీ మరో కథను ఓకే చేశాడని, ఈ సబ్జెక్ట్ ను రైటర్ ఆకుల శివ తెచ్చాడని, దాదాపు సినిమా కూడా ఓకె అయిందని తెలుస్తోంది.

ఇక తేజు కరోనా అనంతరం దేవా కట్టా డైరక్షన్ లో ఓ థ్రిల్లర్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాని నవంబర్ నుండి సెట్స్ పైకి వెళ్తుందట. ఇక ఆ తరువాత బివివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో సాయి తేజ్ మళ్లీ మరో సినిమా చేయనున్నాడు. అలాగే ఆ మధ్య సాయి తేజ్ కి, గోపీచంద్ మలినేని కూడా ఓ స్క్రిప్ట్ చెప్పాడు. అది కూడా సాయి తేజ్ లిస్ట్ లో ఉంది.

ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ షూటింగ్ చేస్తున్నాడు. ఈ చిత్రంతో సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి.

Exit mobile version