మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న అవైటెడ్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”. మంచి బజ్ ఉన్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ మరింత బూస్టప్ ఇచ్చింది అని చెప్పాలి. ఒక మాజీ భార్యాభర్తల నడుమ సాగే ఈ రొమాంటిక్ మెలోడీ నెగిటివిటీకి అతీతంగా సెన్సేషనల్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.
దెబ్బకి ఈ సాంగ్ ఇప్పుడు ఇండియా లోనే నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ దుమ్ము లేపుతుంది. పలు బాలీవుడ్ సాంగ్స్ ని సైతం మించి మీసాల పిల్ల ఇపుడు యూట్యూబ్ మ్యూజిక్ ఛార్ట్స్ లో నెంబర్ 1 గా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి మాత్రం అనీల్ రావిపూడి అనుకున్నట్టు గానే ఈ సాంగ్ కూడా పెద్ద రీచ్ ని సొంతం చేసుకునేలా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా సాహు గారపాటి నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా రాబోతుంది.