ఆమె తెలుగు, తమిళ సినిమాలలో అవకాశాలు ఎలా వున్నా మీరా చోప్రా బాలీవుడ్ పై మాత్రం చాలానే ఆసలు పెట్టుకుంది. చాలా రోజుల తరువాత ఆమె నాగార్జున నటించిన ‘గ్రీకువీరుడు’ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించింది. ప్రియాంక చోప్రా చెల్లెలి వరుస అయిన ఆమె ఇప్పుడు రెండు కొత్త హిందీ సినిమాలకు సంతకం చేసింది. అందులో ఒకటి విక్రమ్ భట్ తీసిన సూపర్ హిట్ సినిమా ‘1920’కు కొనసాగింపు, మరొకటి సతీష్ కౌశిక్ తీస్తున్న ‘గ్యాంగ్ ఆఫ్ ఘోస్ట్స్’. ఈ రెండు సినిమాల షూటింగ్ త్వరలో మొదలుకానుంది. తెలుగులో పవన్ కళ్యాన్ ‘బంగారం’, ఎం.ఎస్ రాజు ‘వాన’ ద్వారా సుపరిచితమైన ఆమెకు ఇక్కడ కాలం అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. కనీసం బాలీవుడ్లో అయినా ఆమెను అదృష్టం వరించాలని కోరుకుందాం