ఐటెం సాంగ్స్ చెయ్యడానికి ఇబ్బంది లేదంటున్న మీనాక్షి

Meenakshi
లైఫ్ స్టైల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మీనాక్షి దీక్షత్ కి ఆ సినిమా పెద్ద గుర్తింపు ఇవ్వకపోయినా మహేష్ బాబు ‘దూకుడు’, ఎన్.టి.ఆర్ ‘బాద్షా’ సినిమాల్లో చేసిన టైటిల్ సాంగ్స్ మాత్రం మంచి పేరే తెచ్చాయి. ఈ రెండు సాంగ్స్ లో మీనాక్షి దీక్షిత్ కనిపించింది చాలా తక్కువ టైం అయినప్పటికీ పెద్ద హీరోల సినిమాలు కావడం వల్ల మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించినప్పటికీ మీనాక్షి దీక్షిత్ కి ఇంకా సరైన బ్రేక్ రాలేదు.

అలాంటి ఈమెని స్పెషల్ సాంగ్స్ చేయడం పట్ల మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే ‘ మొదట నేనొక నటిని. నటి అన్నాక హీరోయిన్ గా చాన్స్ లేదా స్పెషల్ సాంగ్ ఆఫర్ ఇలా ఏది వచ్చినా చేయాలి. ఆ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదని’ తెలిపింది. మీనాక్షి దీక్షిత్ త్వరలోనే ‘అడవి కాచిన వెన్నెల’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఒలంపిక్స్ పాల్గోనాలనుకునే షార్ప్ షూటర్ కనిపించనుంది.

Exit mobile version