ఆసక్తి రేపుతున్న ‘మే 16’ ఫస్ట్ లుక్.

‘నిన్ను తలచి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన హీరో వంశీ యకసిరి. లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన నిన్ను తలచి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఆ సినిమా విజయం తరువాత వంశీ యకసిరి వరుస సినిమాలు చేస్తున్నారు. ధర్మ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో “మే16” అనే సస్పెన్స్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నారు.

షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ని ఈ రోజు వంశీ యకసిరి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేశారు. చేతిలో సిగరెట్ పట్టుకొని సీరియస్ గా ఆలోచిస్తున్న వంశీ జెంటిల్ లుక్ ఆసక్తి రేపుతుంది. ఈ సినిమాకు కెమెరా ధర్మ, సంగీతం : సత్య, నిర్మాతలు : శివ నగేష్, నేదురుమల్లి అజిత్ రెడ్డి, కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం : ధర్మ.

Exit mobile version