మాథెమాటిక్స్ నా లక్ష్యానికి హెల్ప్ అయ్యింది – హరీష్ శంకర్

మాథెమాటిక్స్ నా లక్ష్యానికి హెల్ప్ అయ్యింది – హరీష్ శంకర్

Published on May 6, 2013 8:39 AM IST

Harish-Shankar1

ఎంటర్టైనింగ్ సినిమాలు, సెటైర్ డైలాగ్స్ రాయడంలో డైరెక్టర్ హరీష్ శంకర్ కి మంచి పేరుంది. 2012 లో ‘గబ్బర్ సింగ్’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హరీష్ ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ‘రామయ్యా.. వస్తావయ్యా’ సినిమాతో బిజీగా ఉన్నాడు. కానీ ఈ మాస్ డైరెక్టర్ మాథెమాటిక్స్ చాలా బాగా చేస్తాడని ఎంతమందికి తెలుసు. ఇటీవలే ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలిపాడు.

‘ నాకు సినిమాలు చూడడమంటే చాలా ఇష్టం. క్లాస్ కి బంక్ కొట్టిమరీ సినిమాలకు వెళ్ళేవాన్ని. మా నాన్నగారు తెలుగు టీచర్ కావడంతో నేను డిగ్రీకి వచ్చాక రోజూ సినిమాకి వెళ్ళడానికి ఆయన్ని డబ్బులు అడగాలంటే కాస్త ఇబ్బందిగా ఉండేది. నేను మాథెమాటిక్స్ బాగా చేస్తాను అందుకే మా ఇంటి దగ్గర ఉండే పిల్లలకు ట్యూషన్ చెప్పేవాన్ని. అలా
మాథెమాటిక్స్ ట్యూషన్ చెప్పి వచ్చిన డబ్బు నా లక్ష్యాన్ని చేరుకోవడానికి సాయపడిందని’ హరీష్ శంకర్ అన్నాడు.

మాస్ మసాలా ఎంతర్తింగ్ సినిమాల్లో అన్ని రకాల ఎమోషన్స్ బాలన్స్ చెయ్యాలంటే టాలెంట్ ఉండాలి. చూస్తుంటే ఈ విషయంలో హరీష్ శంకర్ కి మాథెమాటిక్స్ చాలా హెల్ప్ అయినట్టుగా అనిపిస్తోంది.

తాజా వార్తలు