గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో ఔట్ అండ్ ఔట్ ప్యూర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంగా ‘ఆరెంజ్’ క్లాసిక్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు భాస్కర్ డైరెక్ట్ చేయగా అందాల భామ జెనీలియా హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమాకు హ్యారిస్ జైరాజ్ సంగీతం ఎవర్గ్రీన్ సాంగ్స్‌తో ఇప్పటికీ మార్మోగుతుంది. అయితే, ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర హిట్ కాలేకపోయింది.
కానీ, ఈ చిత్రాన్ని టీవీల్లో, యూట్యూబ్‌లో చూసి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని ఇప్పటికే పలుమార్లు రీ-రిలీజ్ చేయగా, అందులోనూ సాలిడ్ రెస్పాన్స్‌ను అందుకుంది. అయితే, ఈ ఎవర్గ్రీన్ క్లాసిక్ రొమాంటిక్ చిత్రం ఇప్పుడు మరోసారి ప్రేమికుల రోజును మరింత ప్రత్యేకం చేసేందుకు సిద్ధమయ్యింది. ఈ చిత్రాన్ని వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న మరోసారి రీ-రిలీజ్ చేస్తున్నారు.
ఇక ఈసారి కూడా ఈ చిత్రాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం బుక్ మై షోలో ఏకంగా 7 వేలకు పైగా టికెట్ బుకింగ్స్ జరిగినట్లు అధికారికంగా వెల్లడించారు. దీంతో ఆరెంజ్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఓ రేంజ్లో ఆసక్తిగా ఉన్నారని పలువురు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.