ఈ వేసవిలో విడుదల కానున్న భారీ సినిమాల విడుదల తేదీలు

ఈ వేసవిలో విడుదల కానున్న భారీ సినిమాల విడుదల తేదీలు

Published on Mar 19, 2012 8:25 AM IST


ఈ ఏడాది వేసవిలో పలు పెద్ద సినిమాలతో ఇండస్ట్రీ కళకళలాడబోతుంది. ‘నా ఇష్టం’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాతో రానా సమ్మర్ సీజన్ మొదలుపెడుతున్నాడు. ఆ తరువాత రామ్ చరణ్ ‘రచ్చ’, ఎన్టీఆర్ ‘దమ్ము’, రాజమౌళి ‘ఈగ’, పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’, రవితేజ ‘దరువు’, అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమా, రామ్ ‘ఎందుకంటే ప్రేమంట’ వంటి సినిమాలు ఈ వేసవిలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి. ఇవే కాకుండా ప్రభాస్ ‘వారధి’ మరియు నాగ చైతన్య నటిస్తున్న ‘ఆటో నగర్ సూర్య’ కూడా కొంత ఆలస్యంగా విడుదల కాబోతున్నాయి.

ఈ భారీ చిత్రాల విడుదల తేదీ విషయానికి వస్తే విశ్వసనీయ వర్గాల మరియు ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఇలా ఉన్నాయి. రామ్ చరణ్ నటిస్తున్న రచ్చ మొదటగా మార్చ్ 29 న విడుదల చేయాలని భావించినప్పటికీ పలు కారణాల వల్ల ఏప్రిల్ 5 కి వాయిదా పడింది. రాజమౌళి ఈగ ఏప్రిల్ 5 న విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో ఏప్రిల్ చివరి వారానికి వెళ్ళింది. ఎన్టీఆర్ దమ్ము ఏప్రిల్ 19 న విడుదలవుతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నా ఏప్రిల్ 27 కి వాయిదా పడే అవకాశాలున్నాయని సమాచారం.

ఈ చిత్ర నిర్మాతలందరూ ఒక్కో సినిమాని 7 నుండి 14 రోజులు తేడాతో విడుదల చేయాలని ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ విడుదల తేదీలు మారినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఏదేమైనప్పటికీ ఈ సినిమాలు ప్రేక్షకులను కన్నుల విందు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజా వార్తలు