రుద్రమదేవి కోసం కుంతల వాటర్ ఫాల్స్ వద్ద భారీ సెట్

రుద్రమదేవి కోసం కుంతల వాటర్ ఫాల్స్ వద్ద భారీ సెట్

Published on Nov 26, 2013 1:27 PM IST

anushka
భారీ వ్యయంతో పెద్ద పెద్ద సెట్స్ వేయడంలో డైరెక్టర్ గుణశేఖర్ కి మంచి పేరుంది. ప్రస్తుతం గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న పీరియడ్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’ కోసం కొన్ని భారీ సెట్స్ ని వేసారు. తాజా సమాచారం ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలోని కుంతల వాటర్ ఫాల్స్ దగ్గర ఓ భారీ సెట్ ని నిర్మిస్తున్నారు. ఈ సెట్ వరంగల్ లోని 100 స్తంబాల గుడిని ప్రతిబింబించేలా ఉంటుందని అంటున్నారు.

అనుష్క రుద్రమదేవి పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. గుణశేఖర్ దర్శకుడిగా, నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు. కృష్ణం రాజు, నిత్యా మీనన్, కేథరిన్, బాబా సెహగల్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ మూవీ 3డి ఎఫెక్ట్స్ కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఈ సినిమా 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు