Rudhramadevi
గుణశేఖర్ ‘రుద్రమదేవి’ 3డి సినిమా భారీ సెట్ల రూపంలో తరచూ వార్తలలో నిలుస్తుంది. ఇప్పుడు గుణశేఖర్ మరో భారీ సెట్ ను నిర్మిస్తున్నాడు. 13వ దశాబ్ధపు కట్టడమైన ఏడు గోడల కోట సెట్ ను వేయనున్నారు

ఈ సెట్ గురించి దర్శకుడు మాట్లాడుతూ “ఈ ఏడు గోడల కోట రాజ్యాన్ని శత్రువుల నుండి రక్షించుకోవడానికి నిర్మించిన కట్టడం. మేము ఆ అద్భుతాన్ని తెరపై చూపింకే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సెట్ కోసం ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి 40రోజులుగా కష్టపడుతున్నాడు. జనవరి 29నుండి భారీ ఫైట్ సన్నివేశాన్ని తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్ ను ఫిబ్రవరి 19కి ముగించానున్నాం” అని తెలిపారు

ఈ సినిమాలో అనుష్క ప్రధానపాత్రధారి. రాణా దగ్గుబాటి, కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, నిత్యామీనన్, కేథరీన్ త్రేస ముఖ్యపాత్రధారులు. ఇళయరాజ సంగీతదర్శకుడు. ఈ సినిమా ఈ యేడాది న మనముందుకు రానుంది

Exit mobile version