ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’లో అత్యంత కీలక యుద్ధ ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఎపిసోడ్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
నిర్మాత శోభు యార్లగడ్డ “500+ మంది నటులు కత్తులు, బళ్ళాలు, ఆయుధాలతో అహర్నిశం కృషి చేస్తున్నారు. యుద్దానికి మేము సిద్ధం” అని ట్వీట్ చేశారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ లో మొదలై మరో రెండునెలలు కొనసాగనుంది
పీటర్ హెయిన్స్ ఆద్వర్యంలో యాక్షన్ సన్నివేశాలు రూపుదిద్ధుకుంటున్నాయి. సిబు సైరల్ ఆర్ట్ డైరెక్టర్. సెంథిల్ కుమార్ కెమెరామేన్. ఎం.ఎం కీరవాణి సంగీత దర్శకుడు. ఈ సినిమా 2015లో విడుదలకానుంది