పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు వైజాగ్ లో నిర్వహించనున్న భహిరంగ సభకి అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలి రానున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ తర్వాత మొదటగా జరుగుతున్న పబ్లిక్ మీటింగ్ ఇదే కానుండడం వల్ల ఆర్గనైజర్స్ ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు.
ఒక్క విశాఖ పట్నం నుంచే కాకుండా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుండి కూడా అభిమానులు లక్షల్లో రానున్నారు. దాంతో అక్కడి వచ్చే స్టూడెంట్స్ మరియు మహిళల కోసం ప్రత్యేక సిట్టింగ్ ఏర్పాట్లు చేసారు. ఈ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎజెండా గురించి, తను చేయబోయే కార్యాచరణ గురించి ప్రసంగించే అవకాశం ఉంది.