“త్రీ రోజెస్” సీజన్ 2 లో మరింత ఫన్ అంటున్న ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్


యువ టాలెంటెడ్ నటీనటులు ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ “త్రీ రోజెస్”. మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ సీజన్ 2 డిసెంబర్ 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో “త్రీ రోజెస్” సీజన్ 2 టీజర్ రిలీజ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆహా కమర్షియల్ హెడ్ రాజేశ్ వాసిరెడ్డి మాట్లాడుతూ – “త్రీ రోజెస్” ఫస్ట్ సీజన్ ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఫస్ట్ సీజన్ సక్సెస్ అయినప్పటి నుంచి సెకండ్ సీజన్ పై డిమాండ్ ఏర్పడింది. మా మేనేజ్ మెంట్ కూడా సీజన్ 2 ఎప్పుడు చేస్తున్నారు అని అడిగేవారు. డిసెంబర్ 12న “త్రీ రోజెస్” సీజన్ 2 స్ట్రీమింగ్ కు రాబోతోంది. మీరంతా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుతున్నా. అన్నారు.

ఆహా కంటెంట్ హెడ్ కవిత మాట్లాడుతూ – ఇయర్ ఎండ్ అంటే ఫెస్టివ్ సీజన్. ఈ ఫెస్టివ్ సీజన్ ను డిసెంబర్ 12న ప్రీమియర్ అవుతున్న “త్రీ రోజెస్” సీజన్ 2తో సెలబ్రేట్ చేసుకుంటారని నమ్ముతున్నాం. ఆహా నుంచి బ్యాక్ టు బ్యాక్ మంచి కంటెంట్ ఉన్న సక్సెస్ ఫుల్ మూవీస్, షోస్ చేస్తున్నాం. మీ ఆదరణ ఇలాగే ఉండాలి. అన్నారు.

యాక్టర్ సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ – “త్రీ రోజెస్” సీజన్ 2లో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఈషాతో కలిసి నటించడం ఈజీ. సీన్ చేసే ముందు డిస్కషన్స్ ఉండేవి. ఇటీవల ఎస్ కేఎన్ మహేశ్ గారి ఫ్యాన్ కు హెల్ప్ చేయడం ఇన్స్ పైర్ చేసింది. అన్నారు.

డైరెక్టర్ కిరణ్ కె కరవల్ల మాట్లాడుతూ – డైరెక్టర్ గా నా డెబ్యూ సిరీస్ ఇది. చాలా బాగా వచ్చింది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్. సిరీస్ మొత్తం ఎంటర్ టైనింగ్ తో ఎంజాయ్ చేస్తారు. మంచి కాస్టింగ్, వాళ్లు ఇచ్చిన పర్ ఫార్మెన్స్ లు ఆకట్టుకుంటాయి. అజయ్ అరసాడ మ్యూజిక్ హైలైట్ అవుతుంది. ఫస్ట్ టైమ్ డైరెక్టర్ కు ఎలాంటి ప్రొడ్యూసర్ కావాలని కోరుకుంటారో ఆ క్వాలిటీస్ అన్నీ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ లో ఉన్నాయి. ఈ సిరీస్ చేసేందుకు ఏం కావాలో అన్నీ సమకూర్చారు, అలాగే బాగా ప్రమోట్ చేస్తున్నారు. అన్నారు.

హీరోయిన్ కుషిత కల్లపు మాట్లాడుతూ – ఈ సిరీస్ లో స్రష్టి అనే క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ కు కొంచెం తిక్క ఉంది కానీ దానికో లెక్క ఉంటుంది. స్రష్టి క్యారెక్టర్ మీ అందరికీ నచ్చుతుంది. ఇలాంటి క్యారెక్టర్ రాయడం కష్టం ఎందుకంటే స్రష్టి క్యూట్, హాట్, నాటీ, క్రేజీగా ఉంటుంది. మా డైరెక్టర్ కిరణ్ గారు కనీసం గట్టిగా మాట్లాడటం కూడా సెట్ లో చూడలేదు. అంత కూల్ గా షూటింగ్ జరిగింది. సిస్టర్స్ లాంటి ఈషా, రాశీతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. అన్నారు.

మరో హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ – “త్రీ రోజెస్” సీజన్ 1 పెద్ద హిట్ అయ్యాక సీజన్ 2 గురించి ప్రతి ఒక్కరూ అడుగుతూ వచ్చారు. నేను ప్రాజెక్ట్ లోకి వచ్చేసరికే ఈ సిరీస్ పై బయట చాలా క్రేజ్ ఉండేది. మేఘన క్యారెక్టర్ లో నేను నటించాను. మేఘన క్యారెక్టర్ కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి. నాలాగే మేఘన పూజలు చేస్తుంది, పబ్ కు వెళ్తుంది, ఫైట్స్ చేస్తుంది. నేను, సత్య కలిసి చాలా ఫన్ సీన్స్ చేశాం. అవన్నీ మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తాయి. ఈ సిరీస్ చేస్తున్నప్పుడు ఈషా మంచి ఫ్రెండ్ అయ్యింది. ఇండిపెండెంట్ వుమెన్ క్యారెక్టర్ లో తన పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. కుషిత క్యారెక్టర్ కు బాగా కనెక్ట్ అవుతారు. “త్రీ రోజెస్” సీజన్ 2ను ఆహాలో చూడండి. అన్నారు.

మన తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా మాట్లాడుతూ – “త్రీ రోజెస్” సీజన్ 1 కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ ఎంటర్ టైన్ మెంట్ ఈ సీజన్ 2లో ఉంటుంది. సీజన్ 1 అంత పెద్ద సక్సెస్ అవుతుందని నేను ఊహించలేదు. సీజన్ 2 స్క్రిప్ట్ చదివినప్పుడే ఇది అంతకంటే పెద్ద హిట్ అవుతుందని నమ్మకం కలిగింది. షూటింగ్ చేస్తున్నప్పుడు మేమంతా ఆ ఫన్ ను ఫీల్ అయ్యాం. నేను, హర్ష ఒక రివేంజ్ మోడ్ లో క్యారెక్టర్స్ చేశాం. ఈ సీజన్ 2 లో చాలా వైరల్ కంటెంట్ ఉంది. మా డైరెక్టర్ కిరణ్ కొత్త దర్శకుడిలా అనిపించలేదు. కాన్ఫిడెంట్ గా సిరీస్ చేశాడు. “త్రీ రోజెస్” సీజన్ 2 ను సినిమాగా రిలీజ్ చేయొచ్చు. అంత మంచి కంటెంట్ ఉంది. ఈ సీజన్ లో రాశీ, సత్య చేసిన క్యారెక్టర్స్ ఫేమ్ అవుతాయి. వాళ్ల కాంబినేషన్ సీన్స్ లోని డైలాగ్స్ వైరల్ గా మారుతాయి. కుషిత క్యూట్ గా, హాట్ గా కనిపిస్తుంది. యూత్ ఆడియెన్స్ తనకు ఫ్యాన్స్ అవుతారు. ఈ సిరీస్ తర్వాత కుషిత స్టార్ అవుతుంది. ఎస్ కేఎన్ గారు తన ప్రొడక్షన్ లో కల్ట్ బ్లాక్ బస్టర్స్ చేశారు. ఇప్పుడు ఈ సిరీస్ తోనూ సక్సెస్ అందుకోబోతున్నారు. అన్నారు.

ఇక మాస్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – “త్రీ రోజెస్” కాన్సెప్ట్ తో ఎన్ని సిరీస్ లు అయినా చేయొచ్చు. అలాంటి యూనిక్ కాన్సెప్ట్ మారుతి గారు ఇచ్చారు. ఆయన రాజా సాబ్ సాంగ్ రిలీజ్ పనుల్లో ఉండి రాలేకపోయారు. టాక్సీవాలా మూవీ చేశాక ఓటీటీలో ఏదైనా కంటెంట్ ప్రొడ్యూస్ చేసేందుకు కావాల్సినంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది “త్రీ రోజెస్”. సీజన్ 1ను మించిన ఎంటర్ టైన్ మెంట్ ఈ సీజన్ 2 లో చూస్తారు. ఫస్ట్ సీజన్ రవి నంబూరి డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు తను మా చెన్నై లవ్ స్టోరీ మూవీ రూపొందిస్తున్నాడు. ఆయన సజెషన్ మీదే కిరణ్ ను డైరెక్టర్ గా , సందీప్ ను రైటర్ గా తీసుకున్నాం. ఈ సిరీస్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ను సందీప్ క్రియేట్ చేశాడు. డైరెక్టర్ గా కిరణ్ క్రియేటివిటీలో “త్రీ రోజెస్” సీజన్ 2 10శాతం మాత్రమే. తన ప్రతిభను ఫ్యూచర్ లో చూస్తారు. ఈషా మన తెలుగు హీరోయిన్స్ లో ఓజీ అనుకోవచ్చు. రాశీ సింగ్ తెలుగు నేర్చుకుని నటిస్తోంది. కుషిత టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయి. నా సినిమాల్లో తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తూ వెళ్తున్నాను. కుషిత తమిళంలో, మలయాళంలో మూవీస్ చేస్తోంది. రాశీ డెడికేషన్ ఉన్న నటి. ఆమె ఇంకా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంటారు. ఈషా తమిళ, మలయాళం, తెలుగులో మూవీస్ చేస్తున్నారు. అయితే ఇది కంటిన్యుటీ ఉన్న సిరీస్ కాబట్టి ఇతర సినిమాలతో బిజీగా ఉన్నా ఆమె చేస్తానని ముందుకువచ్చింది. సత్య ఈ స్రిప్ట్ ను ఇష్టపడి నటించేందుకు వచ్చారు. సత్య ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది. అలాగే హర్ష క్యారెక్టర్ కూడా మంచి ఫన్ అందిస్తుంది. అజయ్ అరసాడ మ్యూజిక్ వింటే నాకు దేవి శ్రీ ప్రసాద్ గుర్తొస్తాడు. ఈ సిరీస్ కోసం మంచి మ్యూజిక్ ఇచ్చాడు. డాల్బీ సౌండ్ లో ఈ సిరీస్ చేశాం. మంచి కంటెంట్ ఉంటే వెంటనే ఓకే చెప్పి సపోర్ట్ చేసే ఓటీటీ ఆహా. డిసెంబర్ 12న “త్రీ రోజెస్” సీజన్ 2 చూసి ఎంజాయ్ చేయండి. “త్రీ రోజెస్” సీజన్ 3 కూడా ఉంటుంది. ఆ సీజన్ ను సినిమాలా రిలీజ్ చేస్తాం. అన్నారు.

Exit mobile version