ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ సాలిడ్ కం బ్యాక్ అందుకోవడమే థ్యేయంగా తన హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో “క్రాక్” అనే పవర్ ఫుల్ కాప్ డ్రామాలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం షూట్ ఇప్పుడు అంతిమ దశలో ఉంది. ఇక ఈ ప్రాజెక్ట్ తర్వాత కూడా రవితేజ లైనప్ గట్టిగానే ఉందని తెలుస్తుంది.
క్రాక్ లైన్ లో ఉండగానే మరో దర్శకుడు రవి వర్మతో ఒక ప్రాజెక్ట్ ను రవితేజ ఓకే చేసేసారు. ఇపుడు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి లేటెస్ట్ టాక్ ఒకటి సినీ వర్గాల్లో బయటకొచ్చింది. రవితేజ ఒక మాస్ హీరోగా ఎన్నో సినిమాల్లో సూపర్బ్ యాక్షన్ ఆకట్టుకున్నారు.
కానీ ఈ చిత్రాన్ని మాత్రం ఇంతకు ముందు రవితేజ ఎప్పుడూ చెయ్యని విధమైన ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటెర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇంకా టాక్ ఏమిటంటే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు అత్యున్నత స్థాయిలో ఉంటాయని సమాచారం. మొత్తానికి అయితే ఈ ప్రాజెక్ట్ ను రవితేజ కెరీర్ లో నెవర్ బిఫోర్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎలా ఉండనుందో చూడాలి.