వెంకటేష్ మరియు రామ్ కలిసి నటిస్తున్న ‘మసాలా’ సినిమా విడుదలకు సిద్దంగావుంది. ఈ సినిమా విడుదల తేదిని త్వరలో ప్రకటించనున్నారు. ప్రస్తుతం టైటిల్ సాంగ్ చిత్రీకరణలో వెంకటేష్, రామ్ జయప్రకాష్ రెడ్డి, కోవై సరళ మరియు ఆలి ఈ పాట చిత్రీకరణలో పాల్గుంటున్నారు
ఈ పాటతో షూటింగ్ దాదాపు ముగుస్తుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ సినిమా కామెడి, యాక్షన్ ను మేళవించిన ఒక మాస్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటుంది. ఈ ‘మసాలా’ బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన ‘బోల్ బచ్చన్’ కు రీమేక్
అంజలి మరియు షాజాన్ పదాంసీ ఈ సినిమాలో హీరోయిన్స్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సురేష్ బాబు మరియు స్రవంతి రవి కిషోర్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు