మార్చ్ 23న విడుదలయిన “ఈ రోజుల్లో” చిత్రానికి అన్ని చోట్ల నుండి సానుకూల స్పందన వినిపిస్తుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన మారుతికి అన్ని వైపుల నుండి ప్రశంశలు అందుతున్నాయి. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ దర్శకుడిని అభినందించిన వారిలో ఒకరయ్యారు. “నేను 5డి కెమెరా తో పెద్ద స్టార్లను నటింపచేసి సాదించలేని విజయాన్ని “ఈ రోజుల్లో” చిత్ర బృందం అదే 5డి కెమెరా ఉపయోగించి విజయం సాదించింది. దొంగలముఠాతో తెరమరుగయిన ఈ టెక్నాలజీని “ఈ రోజుల్లో”తో నిరూపించిన మారుతి నిజమయిన ట్రెండ్ సెట్టర్” అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. శ్రీనివాస్ మరియు రేష్మ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించబడిన చిత్రం. మొదటి రోజు ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన కొనసాగితే ఈ చిత్రం కల్లెక్షన్ల విషయం భారి విజయం సాదిస్తుంది. శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రానికి జేబీ సంగీతం అందించారు.