‘నాటకం’, ‘తీస్ మార్ ఖాన్’ వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్న కళ్యాణ్ జీ గోగణ, ఇప్పుడు యాక్షన్-ఎంటర్టైన్మెంట్ అంశాలతో కూడిన ‘మారియో’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హీరో అనిరుధ్, గ్లామరస్ హీరోయిన్ హెబ్బా పటేల్ జోడీగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.
ఇటీవల విడుదలైన పోస్టర్లు ఆకట్టుకోగా, ప్రత్యేకంగా ‘ఎ టర్బో-చార్జ్డ్ ర్యాంప్ రైడ్’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇది సినిమా స్థాయిని, పవర్ ప్యాక్డ్ యాక్షన్‌ను సూచిస్తోంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను త్వరలోనే పూర్తి చేసి, నవంబర్ నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్నప్పటికీ, నేటి ట్రెండ్‌కు అనుగుణంగా బలమైన కంటెంట్ ఉండేలా దర్శకుడు గోగణ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.


