ఎన్నో బాయ్ ఫ్రెండ్ అని అడిగేవారు – శ్రుతి హాసన్

శ్రుతి హాసన్‌ కి గతంలో కొన్ని ప్రేమ కథలు ఉన్నాయి. ఆమె కొందరితో ప్రేమలో పడింది. తాజాగా తన ప్రేమ కథల పై శ్రుతి హాసన్ ఓపెన్ అయింది. తన లవ్‌స్టోరీలు ఇతరులకు సిల్లీగా అనిపించొచ్చని, కానీ తనకు అలా కాదని హీరోయిన్ శ్రుతిహాసన్ చెప్పుకొచ్చింది. ఈ టాపిక్ పై శ్రుతి హాసన్ ఇంకా మాట్లాడుతూ.. నాతో ఎవరైనా క్లోజ్‌గా ఉంటే ‘ఆయన ఎన్నో బాయ్‌ఫ్రెండ్’ అని నన్ను అడిగేవారు. నిజానికి ‘నేను కోరుకున్న ప్రేమ దక్కకనే లవ్‌లో విఫలం అవుతున్నా. ఇది నన్ను చాలా బాధిస్తుంది. నేనూ మనిషినే కదా. నాకూ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉంటాయి. నాకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. వాటి విషయంలో నేను కాంప్రమైజ్ కాను’ అని శ్రుతి హాసన్ తెలిపింది.

శ్రుతి హాసన్ ఇంకా మట్లాడుతూ.. నేను గతంలో కొందరితో ప్రేమలో పడ్డాను. ఆ సమయంలో వాళ్ళు నన్ను చాలా బాగా చూశారు. వారితో నా లవ్ జర్నీ బాగానే సాగింది. కానీ, కొన్నాళ్ళకు బోర్ గా అనిపిస్తోంది. అందుకే వారికి నేను దూరంగా జరిగాను. ఆ విషయంలో నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌లను నేను ఎప్పటికీ విమర్శించను’ అని శ్రుతి హసన్ తెలిపింది. కమల్‌ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రుతి హాసన్. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తాను ఎప్పుడూ దాన్ని దృష్టిలో పెట్టుకోలేదని, కష్టపడి ఈ స్థాయికి వచ్చాను అంటూ శ్రుతి హాసన్‌ చెప్పుకొచ్చింది.

Exit mobile version