మనుషులతో జాగ్రత్త అంటున్న రాజేంద్ర ప్రసాద్

మనుషులతో జాగ్రత్త అంటున్న రాజేంద్ర ప్రసాద్

Published on Jul 3, 2013 10:00 AM IST

MJ
సినిమాలో ఎంతమంది దేవుళ్ళను చూపించినా యముడికి మాత్రం ప్రత్యేకమైన స్థానం వుంటుంది. అప్పటి కైకాల సత్యనారాయణ దగ్గరనుండి మొన్నటి మోహన్ బాబు వరకూ ఆ పాత్రలో ఓడిగిపోయినవారే. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ యమధర్మరాజుగా కనిపించనున్నసినిమా ‘మనుషులతో జాగ్రత్త’. అక్షయ్ తేజ్, విదర్శ జంటగా నటిస్తున్నారు. గోవింద్ వరహా దర్శకుడు. ఈ సినిమాలో కృష్ణభగవాన్ చిత్రగుప్తుని పాత్రలో కనిపించనున్నాడు. మనిషి డబ్బుకోసం ఎలాంటి పనినైనా చేస్తాడు అన్న నేపధ్యంలో ఈ కధను తెరకెక్కిస్తున్నట్టు, సినిమా ఆద్యంతం వినోదభరితంగా సాగుతుందని తెలిపాడు. ‘నాలుగు స్తంభాలాట’ సినిమాలో నటించిన పూర్ణిమ ఈ సినిమాలో నటిస్తుంది. ఇటీవలే కొన్ని ముఖ్య సన్నివేశాలను వైజాగ్ లో తెరకెక్కించారని నిర్మాత తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు