మంచు మనోజ్ ప్రతి సినిమాలోనూ సరికొత్తగా ఉండే కథలని ఎంచుకుంటాడు. అలా మంచు మనోజ్ తాజాగా చేస్తున్న ప్రయత్నమే ‘పోటుగాడు’. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఈ రోజు ప్రసాద్ లాబ్స్ లో విడుదల కానుంది. మనోజ్ సిమ్రాన్ ముండిగా కనిపించనున్న ఈ సినిమాలో నతాలియా కౌర్, సాక్షి లతో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ గా కనిపించనున్నారు.
ఈ సినిమా చిత్రాకరణ ఇప్పటికే దాదాపు పూర్తయ్యింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాని జూలై లో రిలీజ్ చేయడానికి ప్రొడక్షన్ టీం ప్లాన్ చేస్తోంది. పవన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి చక్రి సంగీతం అందిస్తున్నాడు.