శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమా షూటింగ్లో మంచు మనోజ్ ఒక పాట చిత్రీకరణను పూర్తిచేసుకున్నాడు. ఇటలీలో ప్రణీత సుభాష్, మనోజ్ నడుమ ఈ పాటను తెరకెక్కించారు. ఈ సినిమాలో మోహన్ బాబు, మంచు విష్ణు, రవీనా టండాన్, హన్సిక, ప్రణీత సుభాష్, తనీష్, వరుణ్ సందేశ్ నటిస్తున్నారు.విష్ణు, మనోజ్ ఈ సినిమాను లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎం.ఎం కీరవాణి, అచ్చు, బాబా సెహగల్ మరియు బప్పా లహరి సంగీతం అందిస్తున్నారు. కోన వెంకట్, గోపి మోహన్,బి.వి.ఎస్ రవి స్క్రిప్ట్ అందించారు. హైదరాబాద్ తిరిగివచ్చిన మనోజ్ త్వరలో ‘పోటుగాడు’ సినిమాలో పాల్గుంటాడని అంచనా.