బాలయ్యని డైరెక్ట్ చేయనున్న మనోజ్ !

బాలయ్యని డైరెక్ట్ చేయనున్న మనోజ్ !

Published on Mar 5, 2012 2:31 PM IST


అవును మీరు విన్నది నిజమే నందమూరి బాలకృష్ణ నటించే సన్నివేశాలకు మంచు మనోజ్ డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ, మనోజ్ కలిసి నటిస్తున్న ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రానికి సంభందించిన క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణ, మనోజ్ మరియు సోనూసూద్ పాల్గొంటున్న ఈ యాక్షన్ సన్నివేశాలకి స్వయంగా మనోజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ విషయాన్నీ మనోజ్ తన ట్విట్టర్ అకౌంటులో తెలిపాడు. బాలకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మనోజ్ మరియు దీక్ష సేథ్ జంటగా నటిస్తుండగా శేఖర్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మంచు లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబో శశి సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు