విష్ణు విలనిజం వార్తల్ని కొట్టి పారేసిన మనోజ్

Manoj-and-Vishnu
డా. మోహన్ బాబు తనయుడిగా పరిచయమై హీరోగా వరుస సినిమాలు చేస్తున్న మంచు విష్ణు అక్కినేని ఫ్యామిలీ వారసులంతా కలిసి నటిస్తున్న ‘మనం’ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడనే వార్తలు గత కొద్ది రోజులుగా వస్తున్నాయి. ఈ వార్తలకి మంచు మనోజ్ తెరదించాడు. విష్ణు ‘మనం’ సినిమా కోసం పనిచేయడం లేదని తెలిపాడు.

నాగార్జున – మోహన్ బాబు మధ్య మంచి రిలేషన్ ఉంది. గతంలో మోహన్ బాబు నటించిన ‘అధిపతి’ సినిమాలో నాగార్జున ఓ ముఖ్య పాత్రలో నటించాడు. అలాగే మంచు విష్ణు నటించిన ‘కృష్ణార్జున’ సినిమాలో నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించాడు. దాంతో ‘మనం’ సినిమాలో విష్ణు నటిస్తున్నాడనే వార్తలు ఇన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. మనోజ్ ఇచ్చిన క్లారిటీతో ఈ వార్తలకు తెరపడింది.

Exit mobile version