ప్రొడ్యూసర్ మణిశర్మ!

ప్రొడ్యూసర్ మణిశర్మ!

Published on Dec 10, 2012 4:45 PM IST


తెలుగులో అగ్ర సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మణిశర్మ త్వరలో నిర్మాత అవతారం ఎత్తబోతున్నాడు. తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన మణిశర్మ అగ్ర సంగీత దర్శకుడిగా ఎదిగి ఈ మధ్య కాలంలో సంగీతం అందించడం తగ్గించాడు. వస్తాడు నా రాజు సినిమాని డైరెక్ట్ చేసిన హేమంత్ మధుకర్ మరో సినిమాతో రాబోతున్నాడు ముంబై 125 కిలో మీటర్స్ అనే సినిమా డైరెక్ట్ హేమంత్ మధుకర్ సినిమాని మణిశర్మ, హేమంత్ మధుకర్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం కూడా మణిశర్మ అందిస్తున్నాడు. 3డి ఫార్మాట్లో తెరకెక్కిన ఈ సినిమాలో వీణ మాలిక్, కరణ్ వీర్ బోరా తదితరులు నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2013లో విడుదల కాబోతుంది.

తాజా వార్తలు