లొకేషన్స్ వేటలో మణిరత్నం టీం

mani-ratnam
సౌత్ ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ మణిరత్నం త్వరలోనే ఓ మల్టీ స్టారర్ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు – నాగార్జున కలిసి నటించనున్నారని వార్తలు వచ్చాయి. అలాగే మిగిలిన నటీనటుల నుంచి కూడా పలు పుకార్లు వినిపిస్తున్నాయి. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం నాగార్జున సరసన ఐశ్వర్య రాయ్ నటించనుందని అంటున్నారు. కానీ ఈ వార్తలని మణిరత్నం మాత్రం ఇంకా ఖరారు చేయలేదు.

మరోవైపు మణిరత్నం టీం హైదరాబాద్ కి వచ్చి లోకేషన్స్ అన్వేషిస్తున్నారు. మల్టీ స్టారర్ సినిమా కోసం ఎలాంటి కథని తయారు చేస్తున్నారు అనే విషయంపై ఇంకా ఎలాంటి విషయం ఖరారు కాలేదు. లోకేషన్స్ వేట పూర్తి కాగానే సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

మహేష్ బాబు ప్రస్తుతం ఆగడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటే నాగార్జున మనం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మల్టీ స్టారర్ మూవీలో మహేష్ బాబు సరసన ఎవరు నటించనున్నారనేది త్వరలో తెలియజేసే అవకాశం ఉంది.

Exit mobile version