నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన సినిమా ‘నాయకుడు’ – పూరి

puri
డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయమై 14 సంవత్సరాలైంది. ఇన్నేళ్ళ కెరీర్లో ఎన్నో ఎన్నో హిట్స్ ఇచ్చాడు అలాగే ఎన్నో ఫ్లాప్ సినిమాలు చూడా తీసాడు. బద్రి, ఇడియట్, పోకిరి, బిజినెస్ మేన్ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ తన కెరీర్ లో చాలా ఒడిదుడుకులను కూడా ఎదుర్కొన్నాడు. ఇవి ఎలా ఉన్నా డైరెక్టర్ గా, రైటర్ గా తనకంటూ ప ప్రత్యేక ముద్రని వేసుకున్నాడు.

ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి స్పూర్తినిచ్చిన వ్యక్తులెవరు, సినిమాలేమిటి అనే విషయాలను చెప్పాడు. ‘నాపై ఓషో, రామ్ గోపాల్ వర్మ, శ్రీశ్రీ, చలం మరియు ముప్పాల రంగనాయకమ్మల ప్రభావం ఎక్కువ ఉంది. నేను వారి పుస్తకాలు చదవడం వల్ల, మరియు వారితో గడపడం వల్ల నేను కాస్త రెబల్ గా కనిపిస్తాను. సినిమా విషయానికి వస్తే మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ‘నాయకుడు’ సినిమా నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. నేను ఆ సినిమాని రెండు సార్లే చూసాను కానీ ఇప్పటికీ ఆ సినిమాలోని ప్రతి సీన్ నాకు గుర్తుంది. కమల్ హాసన్ ఆ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న హీరో కానీ ఆడియన్స్ కి మాత్రం పాజిటివ్ గా అనిపిస్తుంది. వీరినాయుడు పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. నేను రాసుకునే సినిమాల్లో ఈ సినిమా ప్రభావం ఎక్కువ ఉంటుంది అందుకే నా సినిమాల్లో హీరో చాలా స్ట్రాంగ్ గా ఉంటాడని’ పూరి అన్నాడు.

పూరి జగన్నాథ్ తదుపరి సినిమా ‘హార్ట్ ఎటాక్’ జనవరి 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది. నితిన్, ఆద శర్మ జంటగా నటించిన ఈ సినిమాని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పై నిర్మించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.

Exit mobile version