చూస్తుంటే ఈ సీజన్ వివాదాలకు కొలమానంగా మారింది, ముఖ్యంగా మతాలకు సంబందించిన విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. ఇటీవలే తమిళనాడులో ముస్లీం గ్రూప్స్ వారు కమల్ తీసిన ‘విశ్వరూపం’ సినిమాలో తమను కించపరిచేలా కొన్ని సీన్స్ ఉన్నాయని ఆ సినిమా రిలీజ్ ని ఆపేశారు. అది అలా సద్దుమనిగిందో లేదో ఇప్పుడు మణిరత్నం ‘కడలి’ సినిమా వివాదంలో చిక్కుకుంది. క్రైస్తవ జననయగ కట్చి(సి.జె.కె) అనే చర్చికి సంబందించిన క్రిష్టియన్ గ్రూప్ కి చెందిన వారు చెన్నై కమీషనర్ ని కలిసి ఈ సినిమాపై ఫిర్యాదు చేశారు.
ఈ సినిమాలో క్రిస్టియానిటీకి వ్యతిరేఖంగా మరియు క్రిష్టియన్ కమ్యూనిటీ ని పూర్ గా చూపించారని కంప్లైంట్ ఇచ్చారు. ఈ విషయం విన్న చాలా మంది ఈ సినిమాలో ఎవరికీ కనిపించని విషయాలు ఏమి కనిపించాయని ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వివాదం ఎంతటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. అర్జున్, అరవింద్ స్వామి, గౌతమ్, తులసి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.