ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “కడల్”. ఒకేసారి తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ప్రముఖ నటుడు కార్తిక్ తనయుడు గౌతం హీరోగా పరిచయం కానున్నారు. కథానాయికగా ప్రముఖ నటి రాధ రెండవ కుమార్తె తులసి పరిచయం కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర తెలుగు వెర్షన్ కి “కడలి” అనే పేరుని పరిశీలిస్తున్నారు. సముద్రంలో చేపలు పట్టే జాలర్ల ప్రేమ కథ నేపధ్యంలో ఈ సినిమా సాగుతుంది కాబట్టి ఈ చిత్రానికి “కడలి” అనే పేరుని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంభందించిన కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రంలో చాలా భాగం కేరళలో తెరకెక్కిస్తున్నారు.లక్ష్మి మంచు,అరవింద్ స్వామి మరియు అర్జున్ లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వనమాలి సాహిత్యం అందిస్తున్నారు. రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.
కడలిగా రాబోతున్న మణిరత్నం చిత్రం
కడలిగా రాబోతున్న మణిరత్నం చిత్రం
Published on Sep 17, 2012 7:10 PM IST
సంబంధిత సమాచారం
- పోల్ : ‘మిరాయ్’ ట్రైలర్ మీకెలా అనిపించింది?
- ట్రైలర్ టాక్: గ్రాండ్ ట్రీట్ ఇవ్వడానికి రాబోతున్న ‘మిరాయ్’
- మరో ఓటిటిలోకి కూడా వచ్చిన నితిన్ రీసెంట్ సినిమా!
- ‘ఓజి’: ఈ విషయంలో కూడా స్పీడ్ పెంచాల్సిందేనా!
- బాలయ్య సినిమా లేనట్టేనా?
- మళ్లీ పవన్ కళ్యాణ్ మేనియా.. ‘ఓజి’తో జానీ డేస్ వెనక్కి
- ‘మాస్ జాతర’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘స్పిరిట్’పై క్రేజీ బజ్.. ఇది మామూలు ట్విస్టు కాదుగా..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- సమీక్ష : ‘కన్యా కుమారి’ – మెప్పించని రొమాంటిక్ డ్రామా
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘మాస్ జాతర’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!
- వీడియో : OG – సువ్వి సువ్వి లిరికల్ వీడియో (పవన్ కళ్యాణ్, సుజీత్)
- ‘మన శంకర వరప్రసాద్ గారు’.. కొత్త పోస్టర్ తో అదరగొట్టారు!
- బాలయ్య సినిమా లేనట్టేనా?
- ‘ఓజి’: ఈ విషయంలో కూడా స్పీడ్ పెంచాల్సిందేనా!