మంచు విష్ణు ఈ మధ్య కాలంలో బిజీ గా ఉన్న నటుల్లో ఒకరు ఈ మధ్యనే “దేనికయినా రెడీ” చిత్రం కోసం ప్రదేశాలని చూడటానికి మరియు రావణ బ్రహ్మ చిత్రంలో మార్షల్ ఆర్ట్స్ నిపుణులను కలవటానికి చైనా వెళ్లి వచ్చారు. కొద్ది రోజులు విరామం ఈ నటుడు “రావణ బ్రహ్మ” కథ చర్చలు కోసం లాస్ ఏంజల్స్ కి వెళ్లనున్నారు. మరొక ఆసక్తికరమయిన వార్త ఏంటంటే ప్రముఖ అంతర్జాతీయ పాప సింగర్ బ్రయాన్ ఆడమ్స్ ని అక్కడ కలవనున్నారు. ఇప్పటి వరకు ఎందుకు కలుస్తున్నారన్న విషయం పై ఎటువంటి సమాచారం లేదు. తన రాబోతున్న చిత్రంలో పాడించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే.