మరో కొత్త సినిమాకు మనోజ్ గ్రీన్ సిగ్నల్..?

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన ‘భైరవం’ మూవీలో ఆయన నటిస్తున్నాడు. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక తేజా సజ్జా హీరోగా తెరకెక్కుతున్న ‘మిరాయ్’ సినిమాలో విలన్ పాత్రలో మనోజ్ కనిపించనున్నాడు.

అయితే, ఇప్పుడు మనోజ్ తాజాగా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘90ఎంఎల్’ చిత్ర దర్శకుడు శేఖర్ రెడ్డి చెప్పిన కథకు మనోజ్ ఓకే చెప్పాడని.. ఈ సినిమాను త్వరలోనే అధికారికరంగా ప్రారంభించబోతున్నట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఓ కొత్త ప్రొడక్షన్ హౌజ్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అవుతుందని తెలుస్తోంది.

మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version