ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో ప్రయోగాత్మక సినిమా చేయాలంటే ఎప్పుడూ సిద్దంగా ఉండే హీరో మంచు మనోజ్. ఇప్పటికే పలు ప్రయోగాత్మక సినిమాలు చేసిన మనోజ్ తాజాగా పోటుగాడు సినిమాతో విజయాన్ని అందుకొని సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా మంచు మనోజ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించింది.
మనోజ్ ఎప్పుడూ తన టీంతో క్లోజ్ గా ఉంటాడు, అలాగే సినిమాప్రమోషన్స్ లో బాగా పాల్గొంటాడు. ఇప్పటి వరకు అతనితో పనిచేసిన టీం కానీ, నిర్మాతలు కానీ మళ్ళీ మళ్ళీ పనిచెయ్యాలనుకుంటారు. కానీ తాజాగా పోటుగాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్ లకి ప్రమోషన్స్ కి మనోజ్ హాజరు కాకపోవడంతో నిర్మాతలకి అతనికి మనస్పర్ధలు వచ్చాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకి మనోజ్ తెరదించాడు. ‘కొత్త సినిమా షూటింగ్ లో ఉండడం వల్ల, షెడ్యూల్స్ అన్నీ బాగా బిజీగా ఉండడం వల్ల ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయానని’ మనోజ్ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం మనోజ్ రెండు సినిమాలతో బిజీ గా ఉన్నాడు.