‘పోటుగాడు’ సినిమాలో ప్రతీ క్రాఫ్ట్ లోనూ తనదైన ముద్ర వేసున మంచు మనోజ్ ఈ సినిమా విజయంపై చాలా నమ్మకంగా వున్నాడు. నటన మాత్రమే కాకుండా ఈ సినిమాలో అతనొక పాటను పాడాడు. ఆ పాట ప్రస్తుతం చార్ట్ బస్టర్ గా నిలిచింది. అంతే కాక ఫైట్ సీన్లను కూడా అతనే దేజైన్ చేశాడు.ఇన్ని టాలెంట్లను పెట్టుకున్న మనోజ్ నూ దర్శకత్వం గురించి ప్రశ్నించగా “మంచి స్క్రిప్ట్ వుంటే నేను దర్శకత్వం చెయ్యడానికి సిద్ధమే.. కానీ ఆ సినిమాలో నేను నటించను. కొత్తవారికి అవకాశం ఇస్తానని” చెప్పాడు.
అతనిని తన ప్రేమ గురించి ప్రశ్నించగా “ప్రస్తుతానికి నేను ఒంటరిగానే వున్నాను. నా ప్రేమ గురించి వినిపిస్తున్నవార్తలన్నీ పుకార్లే. మూడు ముళ్ళు వేసే ముందు మీకు తప్పకుండా చెప్తాను” అని అన్నాడు. నిజంగానే ఇన్ని టాలెంట్లు వున్న మనోజ్ దర్శకుడిగా మారినా ఆశ్చర్యపోనవసరంలేదు. ఏం జరగనుందో త్వరలోనే చూద్దాం