‘మనం’ ట్రైలర్ జనవరి 10న విడుదల ?

‘మనం’ ట్రైలర్ జనవరి 10న విడుదల ?

Published on Dec 31, 2013 5:28 PM IST

Manam
అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తూ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా ‘మనం’. ఈ సినిమా ట్రైలర్ ని జనవరి 10న విడుదల చేయనున్నారనే వార్త ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాకి విక్రం కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అన్ని సవ్యంగా జరిగితే ఈ సినిమా ట్రైలర్ మహేష్ బాబు సినిమా ‘1 – నేనొక్కడినే’ తో స్క్రీన్ పైకి రానుంది. ఈ సినిమా జనవరి 10న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమాని గత కొద్ది రోజులకు ముందు మైసూరు లో షూటింగ్ నిర్వహించారని అధికారికంగా తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ పై నాగార్జున సంతోషంగా వున్నట్టు తెలిపాడు. సమంత, శ్రియ శరన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రుబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమాని నాగార్జున నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు