ఏ.ఎన్.ఆర్, నాగార్జున, నాగ చైతన్యల త్రయం ‘మనం’ ప్రస్తుతం కూర్గ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. సమాచారం ప్రకారం 1 న మొదలుకావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఒక వారం వాయిదా పడింది.
దీని వలన ఈ సినిమా షూటింగ్ ఈ నెల 8 నుండి మొదలైంది. అందుమూలాన షూటింగ్ అనుకున్నదానికంటే ఒక వారం ఆలస్యంగా ముగియనుంది. ప్రస్తుతం నాగార్జున, శ్రియ శరన్ లపై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తరువాత మైసూరు లో షూటింగ్ చెయ్యనున్నారు
ఈ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకుడు. నాగచైతన్య సరసన సమంత నటిస్తుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను నాగార్జున స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు