‘వార్ 2’ కోసం ఫైనల్ వర్క్ షురూ చేసిన మ్యాన్ ఆఫ్ మాసెస్

ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కాకుండా ఎన్టీఆర్ నుంచి తన మొదటి బాలీవుడ్ చిత్రం “వార్ 2” రాబోతుంది. మరి రీసెంట్ గానే వచ్చిన టీజర్ తో మంచి హైప్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటుగా బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 కోసం తన ఫైనల్ వర్క్ ని షురూ చేసేసిన విజువల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మరి ఎన్టీఆర్ తెలుగు, హిందీ సహా తమిళ్ లో కూడా తానే టీజర్ కి డబ్బింగ్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాకి కూడా అన్ని భాషల్లో తానే చెప్పుకోవచ్చు. ఇక ఈ అవైటెడ్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఈ ఆగస్ట్ 14న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version