శ్రీ పెరంబదూర్ గా తన అదృష్టం పరీక్షించుకోనున్న మమ్ముట్టి

Mammootty
మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి టాలీవుడ్ కు సుపరిచితుడే. ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులోకి అనువాదమయ్యాయి.

చాలాకాలం విరామం తరువాత మన సూపర్ స్టార్ ఒక కొత్త చిత్రంతో ఆయన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. ‘మిషన్ 90డేస్’ అనే సినిమా తెలుగులోకి ‘శ్రీ పెరంబుదూర్’ గా అనువాదం కానుంది.

తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా కొన్ని సన్నివేశాలు రీ షూట్ చేసారు. రాజీవ్ గాంధి ని చంపిన నేపధ్యంలో తెరకెక్కించిన సినిమా ఇది. మేజర్ రవి ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు శరవేగంగా సాగుతూ నవంబర్ లో విడుదలకు సిద్ధంగావున్నాయి

శ్రీ తిరుమల హోం ట్రేడర్స్ బ్యానర్ పై వేరయ్య చౌదరి సమర్పణలో షేక్ మొహమద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు

Exit mobile version