బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ అజయ్ దేవగన్ నటిస్తున్న ‘తేజ్’ చిత్రంలో ఐటం గర్ల్ గా నటించబోతుంది. అజయ్ దేవగన్, అనిల్ కపూర్ మరియు జాయెద్ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకుడు. ఈ సినిమాలో ఐటం సాంగ్ ఇంట్రడక్షన్ సాంగ్ గా ఉండబోతుంది. ఆమె ఈ చిత్రంలో చేయబోతున్న ఐటం సాంగ్ కి సంభందించిన ఫస్ట్ లుక్ పైన ఉంది. మల్లికా షెరావత్ ఐటం సాంగ్స్ కి పెట్టింది పేరు. ఈ సినిమాలో ఆమె చేసిన పాట ఎంత వరకు అలరిస్తుందో చూద్దాం.