నిత్యామీనన్ నటించిన మాలిని 22 ఆడవారి రక్షణ నేపధ్యంలో తీసిన సినిమా గనుక హాట్ టాపిక్ గా మారింది. దర్శకురాలు శ్రీప్రియ మలయాళంలో తీసిన 22 ఫిమేల్ కొట్టాయం తెలుగులో నిత్యా, క్రిష్ మరియు నరేష్ ప్రధానపాత్రలలో నటించారు. ఈ సినిమా ఆడియో హైదరాబాద్ లో కొంత సేపటి క్రితమే విడుదలయింది. కృష్ణ, విజయనిర్మల, జయసుధ, లతా రజినికాంత్, రానా, నందిని రెడ్డి, విక్రమ్ వంటి ప్రక్ముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు
ఈ వేడుకలో నిత్యా మాట్లాడుతూ “ఈ సినిమా కధ శ్రీప్రియ నాకు చెప్పినప్పుడు కధలోని లోతుని నేను గమనించాను. చాలా మంది ఈ సినిమా కాస్త విభిన్నంగా వుంటుందని అన్నారు, కానీ నేను ఒకేమాట చెప్తాను. ఈ సినిమా ప్రజలను కదిలించగలిగే ఒక సినిమాగా నిలుస్తుంది. ఇంతటి గాంభీర్యమైన పాత్రలను పోషించిన నా తోటి ప్రధాన పాత్రలు పోషించిన అబ్బాయిలకు నా కృతజ్ఞతలు. నేను అలా ఎందుకు అన్నదీ మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది” అని తెలిపింది
అక్కడకు హాజరయిన ప్రముఖులంతా నిత్యాను, ఇంత తక్కువకాలంలో తానూ సాధించిన ప్రగతిని పొగిడారు. తమిళ్ లో తొలిసారిగా నటించిన నరేష్ మాట్లాడుతూ “నా దర్సకురాలితో, నా తోటి నటులతో కలిసి నటించడం నాకు చాలా నచ్చింది. ఈ సినిమాను 40 రోజులకంటే తక్కువ వ్యవధిలో పుర్తిచేసాం. సరైన ప్లానింగ్ లేకపోతే ఇది సాధ్యంకాదు. నేను ఇప్పటిదాకా 140సినిమాలలో నటించాను కానీ ఇలాంటి పాత్ర ఎన్నడూ పోషించలేదు” అని తెలిపాడు
అరవింద్ శంకర్ సంగీత దర్శకుడు. మనోజ్ పిళ్ళై సినిమాటోగ్రాఫర్. స్క్రిప్ట్ ను సైతం శ్రీ ప్రియ అందించింది. డిసెంబర్ లో విడుదలకానున్న ఈ సినిమాను రాజ్ కుమార్ సేతుపతి నిర్మించాడు