పవన్ టార్గెట్ మారిందిట..!

పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వచ్చే నెలలో ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా కరోనా ఎఫెక్ట్ కారణంగా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీనితో పవన్ టార్గెట్ సమ్మర్ నుండి ఇండిపెండెన్స్ డే కి మారిందని తెలుస్తుంది. ఎటూ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు, దానికి తోడు వకీల్ సాబ్ సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న చిత్రం. కాబట్టి ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల చేయడం మంచిదని చిత్ర యూనిట్ భావిస్తున్నారట.

శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. హిందీ హిట్ మూవీ పింక్ కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో ఆయన లాయర్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంగీతం థమన్ అందిస్తున్నారు. ఇప్పటికే ఓ సాంగ్ ఈ చిత్రం నుండి విడుదల కాగా విశేష ఆదరణ దక్కించుకుంది.

Exit mobile version