పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఫౌజీ కూడా ఒకటి. పీరియాడిక్ వార్ చిత్రంగా ఈ సినిమాను మేకర్స్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు తాజాగా ఓ వార్త సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
ఫౌజీ చిత్రాన్ని 2026 ఏప్రిల్ నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆ నెలలో వచ్చే గుడ్ ఫ్రైడే లాంగ్ వీకెండ్‌పై మేకర్స్ కన్నేసినట్లు సినీ సర్కిల్స్ టాక్. ఈ లోగా సినిమా షూటింగ్ ముగించేందుకు ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఆయన మరో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ‘స్పిరిట్’ చిత్రాన్ని ప్రారంభించక ముందే ఫౌజీ చిత్ర షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడట.
ఇక ఈ సినిమాలో అందాల భామ ఇమాన్వి హీరోయిన్‌గా పరిచయం కానుంది. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.