ప్రభాస్ కోసం భారీ క్యాస్టింగ్.. హాలీవుడ్ టెక్నీషియన్స్..!

ప్రభాస్ కోసం భారీ క్యాస్టింగ్.. హాలీవుడ్ టెక్నీషియన్స్..!

Published on May 9, 2020 8:11 AM IST

మహానటి సినిమాతో అందరినీ మెస్మరైజ్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఆ సినిమా విడుదలైన రెండేళ్లకు రెబెల్ స్టార్ ప్రభాస్ తో ఓ భారీ చిత్రం ప్రకటించారు. ఇది పాన్ ఇండియా కూడా కాదు పాన్ వరల్డ్ అని చెప్పడంతో ఫ్యాన్స్ అంచనాలు ఆకాశానికి చేరాయి. ఈ సినిమా జోనర్ ఏమిటనేది మేకర్స్ బయటికి చెప్పకున్నప్పటికీ ఇది ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ… ప్రభాస్ ఓ సూపర్ హీరోలా కనిపించే సూచనలు కలవు అంటున్నారు.

ఇటీవల నిర్మాత అశ్వినీ దత్ ఈ సినిమా బడ్జెట్. వందల కోట్లలో ఉంటుంది అన్నారు. ఇక ఈ సినిమాకు స్టార్ క్యాస్ట్ సైతం భారీగా ఉండనుంది. వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులను ఈ సినిమా కోసం తీసుకోనున్నారు. అలాగే వివిధ సాంకేతిక విభాగాలకు సంబంధించి హాలీవుడ్ నిపుణులను తీసుకోనున్నారు. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిననున్నారు. 2020అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనుండగా, 2022 సమ్మర్ కానుకగా విడుదల చేయాలన్నది ప్లాన్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు