‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సాలిడ్ విజువల్ ట్రీట్ చిత్రమే “ది రాజా సాబ్”. చాలా కాలం తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మంచి ఎంటర్టైనర్ సినిమా ఇది కాగా ఆ మధ్య వచ్చిన టీజర్ తో మంచి అంచనాలు సెట్టయ్యాయి.

ఇక ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇంకో క్రేజీ ట్రీట్ అప్డేట్ ఇపుడు వచ్చింది. నేడు ప్రముఖ సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విషెస్ చెబుతూ సినిమా ఇంట్రో సాంగ్ గా అయన అద్భుతమైన సాహిత్యాన్ని అందించినట్టుగా కన్ఫర్మ్ చేశారు.

ఇక ఈ సాంగ్ థియేటర్స్ లో మీతో థియేటర్స్ లో విజిల్ కొట్టించేలా ఉంటుంది మాస్ ప్రామిస్ చేస్తున్నారు. దీనితో ఈ ఇంట్రో సాంగ్ కోసం అభిమానులు మంచి ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version