తమిళ స్టార్ హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన సాలిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం సూర్య నటిస్తున్న ‘కరుప్పు’ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేయగా అది పవర్‌ఫుల్ ట్రీట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక సూర్య తన కెరీర్‌లో 46వ చిత్రాన్ని తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో చేస్తున్నాడు.
ఈ సినిమా నుంచి కూడా మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ ట్రీట్ ఇచ్చారు. ఈ సినిమాలో సూర్య లుక్ ఎలా ఉండబోతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఓ అదిరిపోయే పోస్టర్‌తో సూర్య బర్త్ డే ట్రీట్ అందించారు. ఈ సినిమాలో సూర్య కూల్ లుక్స్‌తో ఇరగదీయబోతున్నట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాతో సూర్య తమిళ్‌తో పాటు తెలుగులోనూ సాలిడ్ విజయాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.
కాగా ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోండగా జివి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.