ఓటిటీలో రిలీజ్ కి మేకర్స్ అంగీకరించట్లేదు ?

క‌రోనా మ‌హ‌మ్మారితో సినీ ప్ర‌పంచం మెత్తం అత‌లాకుత‌ల‌మవుతుంది. లాక్‌డౌన్ తో ఆపేసిన సినిమాల షూటింగ్స్ మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో ఇంకా క్లారిటీ లేదు. దాంతో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియకుండా పోయింది. నాలుగు నెలలు ముందే దర్శకనిర్మాతలు పక్కా ప్లానింగ్ తో రిలీజ్ డేట్స్ ను ముందుగానే ప్రకటించి ఆ దిశగా ముందుకు వెళ్తున్న క్రమంలో సడెన్ గా కరోనా వచ్చి సినిమా ఇండస్ట్రీని స్తంభింప చేసేసింది.

దాంతో సినిమాలన్ని పోస్ట్ ఫోన్ అవ్వక తప్పలేదు. నిశ్శబ్దం, రెడ్, మాస్టర్ (తమిళ డబ్), ‘వి’, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, ఒరేయ్ బుజ్జిగా, ఉప్పెన లాంటి సినిమాలు ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్నాయి. లాక్ డౌన్ పెరిగే కొద్దీ నిర్మాతలకు అదనపు వడ్డీ రూపంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, ఒరేయ్ బుజ్జిగా, ఉప్పెన లాంటి చిన్న సినిమాలు ఓటిటీలో రిలీజ్ అయితే బెటర్ అని ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినా ఓటిటీ ప్లాట్ ఫామ్ పై డైరెక్ట్ రిలీజ్ కి మాత్రం మేకర్స్ అంగీకరించట్లేదు.

Exit mobile version