పుకార్లపై కింగ్డమ్ టీమ్ క్లారిటీ.. తుఫాను కోసం వేచి చూడండి!

పుకార్లపై కింగ్డమ్ టీమ్ క్లారిటీ.. తుఫాను కోసం వేచి చూడండి!

Published on Jun 4, 2025 3:00 AM IST

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ‘కింగ్డమ్’ మేకర్స్ ఈ వార్తలకు చెక్ పెట్టారు. తమ సినిమా ఎలాంటి రీషూట్ జరుపుకోవడం లేదని.. ఎలాంటి వాయిదాలు ఉండబోవని వారు తెలిపారు. తమ సినిమా అనుకున్నట్లుగానే సాలిడ్‌గా వస్తుందని.. తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం ఇలాగే ఉంటుందని వారు అంటున్నారు.

మొత్తానికి కింగ్డమ్ చిత్రానికి సంబంధించి వస్తున్న వార్తలన్నీ కూడా ఫేక్ అని మేకర్స్ తేల్చారు. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు